మాచునూర్ లో కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎంపీ

 మాచునూర్ లో కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎంపీ

ఝరాసంగం, వెలుగు: మండల పరిధిలోని మాచునూర్​గ్రామ శివారులో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సోమవారం కలెక్టర్ క్రాంతి, ఎంపీ సురేశ్​కుమార్​షెట్కార్, అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పరిశీలించారు. ఈ నెల 23న జహీరాబాద్​ఏరియాకు సీఎం రేవంత్​రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నందున కేంద్రీయ విద్యాలయంతో పాటు నిమ్జ్​వెళ్లడానికి వేసిన రోడ్డును పరిశీలించారు. కాగా సీఎం పర్యటన అధికారికంగా ఖరారు కాలేదు. వారి వెంట ఆర్డీవో రాంరెడ్డి, డీఎస్పీ రాంమోహన్​రెడ్డి, డీపీవో సాయిబాబా, తహసీల్దార్​తిరుమల్​రావు, ఎంపీడీవో సుధాకర్​ఉన్నారు.​​